XtGem Forum catalog
Jesus,3gp,
mp3,songs, videos, softwares, games, movies, live tv,etc...

www.chandruj.wap.sh

Thru the Bible 2
ALAYAMLO PRAVESINCHANDI LYRICS
అందాలతార
పల్లవి:అందాలతార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
ఆది దేవుని జూడ - అశింపమనసు–పయనమైతిమి..అందాలతార..
1.విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను
వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్..అందాలతార..
2.యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు
ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి
ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు..అందాలతార..
3.ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన..అందాలతార..
అపరాధిని యేసయ్య
పల్లవి:అపరాధిని యేసయ్య - క్రపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ క్రపలో - నపరాధములను క్షమించు..అపరాధిని..
1.సిలువకు నినునే గొట్టితీ - తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా..అపరాధిని..
2.ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితి వయ్యో..అపరాధిని..
3.ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ..అపరాధిని..
4.దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావినిడితి
ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను..అపరాధిని..
5.ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్క్రూరుండనై గొట్టితిని - ఘోరంపి పాపిని దేవా..అపరాధిని..
ఆడెదన్ పాడెదన్
పల్లవి:ఆడెదన్,పాడెదన్,యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
ఆడెదన్,పాడెదన్,యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
1.నను దర్శించి నూతన జీవం యిచ్చిన సన్నిధిలో
నను బలపరచి ఆదరించిన యేసుని సన్నిధిలో(2X)
ఆడెదన్,పాడెదన్దేవుని సన్నిధిలో
స్తుతించెదన్స్తుతించెదన్ ఆరధించెదన్ఆరధించెదన్ దేవుని సన్నిధిలో
ఆడెదన్,పాడెదన్,యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
2.పరిశుద్దాత్మజ్వాల రగిలించి నన్ను మండించిన సన్నిధిలో
పరిశుద్దాత్మలో నను అభిషేకించిన యేసుని సన్నిధిలో(2X)
ఆడెదన్,పాడెదన్దేవుని సన్నిధిలో
స్తుతించెదన్స్తుతించెదన్ ఆరధించెదన్ఆరధించెదన్ దేవుని సన్నిధిలో
ఆడెదన్,పాడెదన్,యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
ఆడెదన్,పాడెదన్,యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
అత్యున్నతసింహాసనముపై
పల్లవి:అత్యున్నతసింహాసనముపై - ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతుము నిన్నే
ఆహాహా ... హల్లేలూయ(4X)
ఆహాహా ... హల్లేలూయ(3X)...ఆమెన్
1.ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతిస్తోత్రం
…ఆహాహా…
2.కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే-నా రక్షణకర్తా స్తోత్రం
…ఆహాహా…
3.ఆమేన్ అనువాడా స్తోత్రం - ఆల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం
…ఆహాహా…
4.మ్రుత్యుంజయుడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవా త్వరలో రానున్న - మేఘవాహనుడా స్తోత్రం
…ఆహాహా…
అన్ని నామముల కన్న
పల్లవి:అన్ని నామముల కన్న పై నామము _ యేసునినామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయంలయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్(2X)
1.పాపముల నుండి విడిపించును _ యేసునినామము
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయంలయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్(2X)
2.సాతాను పై అధికార మిచ్చును _ శక్తి గలయేసు నామము
శత్రు సమూహము పై జయమునిచ్చును _ జయశీలుడైన యేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయంలయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్(2X)
3.స్తుతి ఘన మహిమలు చెల్లించుచు _ క్రొత్త కీర్తన పాడెధము
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో _ స్తోత్ర గానము చేయుదము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయంలయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్(2X)
అన్ని నామముల కన్న పై నామము _ యేసునినామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయంలయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్(2X)
ఆరాధించెదను
పల్లవి:ఆరాధించెదను నిన్ను,నా యేసయ్య-ఆత్మతోసత్యముతో(2X)
ఆనందగానముతో-ఆర్భటనాదముతో(2X)
ఆరాధించెదనునిన్ను,నా యేసయ్య-ఆత్మతో సత్యముతో(2X)
1.నీజీవవాక్యమునాలో-జీవముకలిగించే(2X)
జీవితకాలమంత,నాయేసయ్య-నిన్నేకొలిచెదను(2X)
ఆరాధించెదను నిన్ను,నా యేసయ్య-ఆత్మతో సత్యముతో(2X)
2.చింతలెన్నికలిగినను-నిందలన్నినన్నుచుట్టినా(2X)
సంతోషముగనేను,నాయేసయ్య-నిన్నేవెంబడింతును(2X)
ఆరాధించెదను నిన్ను,నా యేసయ్య-ఆత్మతోసత్యముతో(2X)
ఆనందగానముతో-ఆర్భటనాదముతో(2X)
ఆరాధించెదను నిన్ను,నా యేసయ్య-ఆత్మతో సత్యముతో(2X
ఆలయంలో ప్రవేశించండి
పల్లవి:ఆలయంలో ప్రవేశించండి అందరూ
స్వాగతం సుస్వాగతం యేసునామంలో
మీ బ్రతుకులో పాపమా కలతలా
మీ హృదయంలో బాధలా కన్నీరా
మీ కన్నీరంతా తిడిచి వేయు రాజు యేసు కోసం
1.దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
వెదకే వారికంతా కనబడు దీపము
యేసురాజు మాటలే వినుట ధన్యము
వినుట వలన విశ్వాసం అధికమధికము
ఆత్మలో దాహము తీరెను రారండి
ఆనందమనందం హల్లెలూయా..ఆలయంలో..
2.ప్రభు యేసు మాటలే పెదవిలోమాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం మంచి మాటలే
హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
నింపెదం నిండెదం కోరేదం పొందెదం
ఆనదంమానదం హల్లెలూయా..ఆలయంలో..
ఆశ్చర్యమైన ప్రేమ
పల్లవి:ఆశ్చర్యమైన ప్రేమ-కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది - నన్ను జయించె నీ ప్రేమ
1.పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి,ఆదరించి,సేదదీర్చి,నిత్య జీవమిచ్చె
…ఆశ్చర్యమైన ప్రేమ…
2.పావన యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి,జీవమిచ్చి,జయమిచ్చి,తన మహిమ నిచ్చే
…ఆశ్చర్యమైన ప్రేమ…
3.శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని,ప్రేమది,ఎన్నడు,యెడబాయదు
…ఆశ్చర్యమైన ప్రేమ…
4.నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి,కౌగలించి,ముద్దాడి,కన్నీటిని తుడిచే
…ఆశ్చర్యమైన ప్రేమ…
ఆహామహానందమే
పల్లవి:ఆహామహానందమే - ఇహ పరంబులన్
మహావతారుండౌ-మా యేసు జన్మ దినం - హల్లేలూయ..ఆహా..
1.కన్యక గర్భమందు పుట్టగా - ధన్యుడవంచు దూతలందరు(2X)
మాన్యులౌపేద గొల్లలెందరో - అన్యులౌతూర్పు జ్ఞానులెందురో(2X)
నిన్నారాధించిరి-హల్లేలూయ..ఆహా..
2.యెహోవా తనయా - యేసు ప్రభూ,సహాయుడా - మా స్నేహితుడా(2X)
ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్-మహానందముతోనిన్నారాధింతుము(2X)
నిన్నారాధింతుము-హల్లేలూయ..ఆహా..
3.సర్వేశ్వరున్ రెండవ రాకడన్ - స్వర్గంబు నుండి వచ్చు వేళలో(2X)
సర్వామికా సంఘంబు భక్తితో - సంధించి నిన్ స్తోత్రిం చువేళలో(2X)
నిన్నారాధింతుము-హల్లేలూయ
ఇది కోతకు సమయం
పల్లవి:ఇది కోతకు సమయం = పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా
పైరును చూచెదమా = పంటను కోయుదమా
1.కోతెంతో విస్తారమాయెనే కోసెడి పనివారు కొదువాయెనే
ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే..ఇది కోతకు..
2.సంఘమా మౌనము దాల్చకుమా కోసెడి పనిలోన పాల్గొందుమా
యజమాని నిధులన్ని మీకేగదా..ఇది కోతకు..
3.శ్రమలేని ఫలితంబు మీకీయగా కోసెడి పనిలోన పాల్గొందుమా
జీవార్ధ ఫలములను భుజియింతమా..ఇది కోతకు..
ఉదయ కాంతి రేఖలో
పల్లవి:ఉదయ కాంతి రేఖలో - బెత్లెహేము పురమున
అవతరించెను బాల యేసు - పాపాలు మోయు గొర్రె పిల్ల
పాపాలు మోయు గొర్రె పిల్ల
1.పరమ పుత్రుని మోహన రూపుగని - తల్లి మరియ మురిసే
బాల యేసుని మహిమ రూపు-ఈ జగానికి వెలుగై
గొల్లలు జ్ఞానులు పరిశుద్దులు - ప్రస్తుతించిరి బాల యేసుని..ఉదయ..
2.ఆకాశ తారల మెరుపు కాంతిలో - ప్రక్రుతి రాగాల స్వరాలతో
హల్లెలూయ యని పాడుచు - దూత గణము స్తుతించిరి
జగ మొక ఊయలగా చేసి - దూతలు పాడిరి జోల పాట..ఉదయ.
ఉన్నతమైన ప్రేమ(Dm)
పల్లవి:ఉన్నతమైన ప్రేమ - అత్యున్నతమైన ప్రేమ
శాశ్వతమైన ప్రేమ - పరిపూర్ణమైన ప్రేమ
యేసుని ప్రేమా - ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా
1.నింగి నుండి నేలకు దిగివచ్చిన ప్రేమా
నేల నుండి నన్ను లేవనెత్తిన ప్రేమ(2X)
మంటి నుండి మహిమకు నను మార్చిన ప్రేమ(2X)
ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా
…ఉన్నతమైన ప్రేమ…
2.నీదు ప్రేమ నాకు జీవం - నా సమస్తమును
నీవు పొందిన శ్రమలన్నియును నాదుడెందములో(2X)
నీవు కార్చిన రక్తమేనా -ముక్తి మార్గమై(2X)
ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా
…ఉన్నతమైన ప్రేమ…
ఉన్నతమైన స్థలములలో(Cm)
పల్లవి:ఉన్నతమైన స్థలములలో- ఉన్నతుడా మా దేవా
ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా||ఉన్నత||
1.చెదరి పోయినది మా దర్శనము - మందగించినది ఆత్మలభారం
మరచిపోతిమి నీ తొలిపిలుపు - నీ స్వరముతో మము మేలుకొలుపు
నీ ముఖకాంతిని ప్రసరింపచేసి - నూతన దర్శన మీయుము దేవా
నీ సన్నిధిలో సాగిలపడగా - ఆత్మతో మము నిలుపుము దేవా||ఉన్నత||
2.పరిశోధించుము మా హృదయములను - తెలిసికొనుము మా తలంపులను
ఆయాసకరమైన మార్గము మాలో - వున్నదేమో పరికించు చూడు
జీవపు ఊటలు మాలోన నింపి - సేదదీర్చి బ్రతికించు మమ్ము
మా అడుగులను నీ బండపైన - స్థిరపరచి బలపరచుము దేవా||ఉన్నత||
3.మా జీవితములు నీ సన్నిధిలో - పానార్పణముగా ప్రోక్షించెదము
సజీవయాగ శరీరములతో - రూపాంతర నూతన మనసులతో
నీ ఆత్మకు లోబడి వెళ్ళెదము - నీ కృపచేత బలపడియెదము
లోకమున నీ వార్తను మేము - భారము తోడ ప్రకటించెదము||ఉన్నత||
ఊహల కందని లోకములో(Fm)
పల్లవి:ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు(2X)
ఉoటివిగా నిరంతరము ఉన్నతుడాసర్వోన్నతుడా(2X)
1.సెరూబులు దూతాళి పరిశుద్దుడు పరిశుద్దుడని(2X)
స్వరమెత్తి పరమందు పాటలు పాడేటి పావనుడా(2X)
హల్లేలూయ,హల్లేలూయ,హల్లెలూయా,హల్లేలూయ(2X)
…ఊహల…
2.ఆల్ఫయను ఒమేగయను అన్నీ కాలంబుల నుండువాడా(2X)
సర్వాధికారుండా సర్వేశ సజీవుండా(2X)
హల్లేలూయ,హల్లేలూయ,హల్లెలూయా,హల్లేలూయ(2X)
…ఊహల…
ఎందుకో నన్నింతగ నీవు
పల్లవి:ఎందుకో నన్నింతగ నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయ యేసయ్యా
1.నా పాపము బాపనరరూపి వైనావు-నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే..హల్లెలూయ..
2.నీ రూపము నాలో నిర్మించి యున్నావు నీ పోలికలోనే నివసించు చున్నావు
నీవు నన్ను ఎన్ను కొంటివి నీ కొరకై నీ క్రుపలో..హల్లెలూయ..
3.నా శ్రమలు సహించి నా ఆశ్రయ మైనావు - నా వ్యధలు భరించి నన్నా దు కొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు నను దాచి యున్నావు..హల్లెలూయ..
ఎన్ని తలచినా
పల్లవి:ఎన్ని తలచినా - ఏదిఅడిగినా - జరిగేది నీ చిత్తమే
ఎన్ని తలచినా - ఏదిఅడిగినా - జరిగేది నీ చిత్తమే
ప్రభువాజరిగేది నీ చిత్తమే
నీ వాక్కుకై-వేచి యుంటిని-నా ప్రార్ధన ఆలకించుమా
ప్రభువా-నా ప్రార్ధన ఆలకించుమా
1.నీ తోడు లేక - నీ ప్రేమ లేక - ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు
నీ తోడు లేక - నీ ప్రేమ లేక - ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు
అడవి పూవులే - నీ ప్రేమ పొందగా - అడవి పూవులే - నీ ప్రేమ పొందగా
నా ప్రార్ధన ఆలకించుమా-ప్రభువానా ప్రార్ధన ఆలకించుమా
2.నా ఇంటి దీపం - నీవే అని తెలిసి - నా హృదయం నీ కొరకు పదిల పరచితి
నా ఇంటి దీపం - నీవే అని తెలిసి - నా హృదయం నీ కొరకు పదిల పరచితి
ఆరిపోయిన నా వెలుగు దీపము -ఆరిపోయిన నా వెలుగు దీపము
వెలిగించుము నీ ప్రేమతో-ప్రభువావెలిగించుము నీ ప్రేమతో
3.ఆపదలు నన్ను - వెన్నంటియున్న-నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి
ఆపదలు నన్ను - వెన్నంటియున్న-నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి
లోకమంతయు నన్ను విడిచినా -లోకమంతయు నన్ను విడిచినా
నీ నుండి వేరు చేయవు - ప్రభువానీ నుండి వేరు చేయవు
ఎన్ని తలచినా - ఏదిఅడిగినా - జరిగేది నీ చిత్తమే
ప్రభువాజరిగేది నీ చిత్తమే
ఒకసారి ఆలోచించవా(Dm)
పల్లవి:ఒకసారి ఆలోచించవా.. ఓ సోదరా
ఒకసారి అవలోకించవా.. ఓ సోదరీ(2X)
నీ జీవిత మూలమేదో - నీ బ్రతుకు ఆధారమేదో(2X)
…ఒకసారి…
1.తండ్రి యెహోవా తన్ను పోలి - నిను చేసెను తన వూపిరిలో(2X)
నా వలెనే నీవు పరిశుద్దముగ - జీవించమని కోరెను.
...నీ జీవిత…
2.దేవుని వదలి దుష్టుని కూడి - లోకము తట్టు మరలి(2X)
లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలొ అణగారితివా
...నీ జీవిత…
3.లోకము వీడు యేసయ్యన్ చూడు - నిత్య జీవముకై పరుగిడు(2X)
నేనే మార్గము,సత్యము,జీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా
...నీ జీవిత…
ఓ నీతి సూర్యుడా
పల్లవి:ఓ నీతి సూర్యుడా - క్రీస్తేసు నాథుడా
నీ దివ్య కాంతిని - నాలో వుదయింప జేయుమాప్రభూ
నన్ను వెలిగించుమా..ఓ నీతి..
1.నేనే లోకానికి - వెలుగై యున్నానని
మీరు లోకానికి - వెలుగై యుండాలని
ఆదేశమిచ్చినావుగావున- నాలో వుదయించుమాప్రభూ
నన్ను వెలిగించుమా..ఓ నీతి..
2.నా జీవితమునే - తూకంబు వేసిన
నీనీతిత్రాసులో - సరితూగ బోనని
నేనెరిగియింటిగావున - నాలో వుదయించుమాప్రభూ
నన్ను వెలిగించుమా..ఓ నీతి..
ఓ యేసు నీ దివ్య ప్రేమ
పల్లవి:ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా
విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ(2X)
1.సిలువే శరణం ప్రతి జీవికివిలువే లేని మనుజాళికి(2X)
కలుషము బాపిన యేసయ్యకి
అలుపెరుగక ప్రార్ధన చేయుదము||ఓ యేసు||
2.తరతరములలో నీ నామమువరముల నొసగిన పై నామను(2X)
అరయగ అరుదెంచావయ్య
మొరలిడుదును మదిలో నేనయ్య||ఓ యేసు||
ఓరన్నఓరన్న
పల్లవి:ఓరన్నఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _చూడన్నా(2X)
1.చరిత్రలోనికి వచ్చాడన్నా_ పవిత్ర జీవం తెచ్చాడన్నా(2X)
అద్వితీయుడు ఆదిదేవుడు _ ఆదరించెను ఆదుకొనును(2X)
ఓరన్నఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _చూడన్నా(2X)
2.పరమును విడచి వచ్చాడన్నా_ నరులలో నరుడై పుట్టాడన్నా(2X)
పరిశుద్దుడు పావనుడు _ ప్రేమించెను ప్రాణమిచ్చెను(2X)
ఓరన్నఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _చూడన్నా(2X)
3.శిలువలో ప్రాణం పెట్టా డ న్నా _ మరణం గెలిచి లేచాడన్న(2X)
మహిమ ప్రభూ మృత్యంజయుడు _ క్షమియించును జయమిచ్చును(2X)
ఓరన్నఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _చూడన్నా(2X)
కనుమా సిలువపై
పల్లవి:కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు
మనకైసిలువపై మేకులతో కొట్టబడెను
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు
మనకైసిలువపై మేకులతో కొట్టబడెను
1.ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను
ప్రియమైన తన కుమారుని ఈధరకేపంపెను
ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను
ప్రియమైన తన కుమారుని ఈధరకేపంపెను
ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు(2X)
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు
మనకైసిలువపై మేకులతో కొట్టబడెను
2.బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను
కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను
బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను
కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను
అలసి,సొలసి,నిస్సాహాయుడై తానునిలిచెను(2X)
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు
మనకైసిలువపై మేకులతో కొట్టబడెను
మేకులతో కొట్టబడెను
మేకులతో కొట్టబడెను
కల్వరిగిరిలోనసిల్వలో
పల్లవి:కల్వరిగిరిలోనసిల్వలోశ్రీయేసు పలు బాధలొందెను
ఘోరబాధలు పొందెను నీ కోసమే అది నాకోసమే(2X)
1.వధ చేయబడు గొర్రెవలె బదులేమీ పలుకలేదు
దూషించు వారిని చూచి దీవించి క్షమియించెచూడు(2X)
2.సాతాను మరణమున్ గెల్చి పాతాళ మందు గూల్చి
సజీవుడై లేచినాడు స్వర్గాన నినుచేర్చినాడు(2X)
కలువరిగిరి సిలువలో
పల్లవి:కలువరిగిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా(2X)
విశ్వ మానవ శాంతి కోసం - ప్రాణ మిచ్చిన జీవమా(2X)
యేసు దేవ నీదు త్యాగం-వివరింప తరమా(2X)
కలువరిగిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా
1.కరుణ లేని,కఠిన లోకం-కక్షతో సిలువేసిన(2X)
కరుణ చిందు మోము పైన-గేలితోఉమ్మేసిన(2X)
ముల్లతోను,మకుటమల్లి - నీదు శిరమున నుంచిరా
నీదు శిరమున నుంచిరా
కలువరిగిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా
2.జాలి లేని పాప లోకం - కలువ లేదు చేసిన(2X)
మరణ మందు సిలువలోన - రుదిరమేనినుముంచిరా(2X)
కలుష రహిత వ్యధను చెప్పి-అలసి సొలసి పోతివా
అలసి సొలసి పోతివా
కలువరిగిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా(2X)
విశ్వ మానవ శాంతి కోసం - ప్రాణ మిచ్చిన జీవమా(2X)
యేసు దేవ నీదు త్యాగంవివరింప తరమా(2X)
కలువరిగిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా
క్రీస్తు జననము
పల్లవి:హల్లెలుయా అని పాడుచుక్రుపామయా నీకు స్తోత్రము
పరిశుద్దుడు - ప్రేమ స్వరూపి
ఈ జగానికి స్వాగతం,సుస్వాగతం,సుస్వాగతం
1.దయా కిరాటము దరింప చేసిధరణిలో వెలసితివి
దీనులైన మాకు - నీ ప్రేమ నేర్పిటివి2X
నీ వెలుగు ప్రకాశింప - నీ కరుణ ప్రకాశింప - నీ సత్యము చాటింప
నీ వెలుగును ప్రకాశింప..హల్లెలుయా..
2.సంతసంబున నీ జననము మా బ్రతుకంత ధన్యమాయే
చాటెను సువార్త జగతికి వేలిసేను ఆశా జ్యోతి2X
ఈ దివిలో రాజు నీవే నా మదిలో శాంతి నీవే
కుమ్మరించు నీదు ఆత్మ2X
..హల్లెలుయా..
క్రీస్తు నేడు లేచెను
1.క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ
మర్త్య దూత సంఘమాఆ ఆ ఆ హల్లెలూయ
భూమి నాకసంబులోఆ ఆ ఆ హల్లెలూయ
బాడుమిందు చేతనుఆ ఆ ఆ హల్లెలూయ
2.మోక్షమియ్య నాథుడుఆ ఆ ఆ హల్లెలూయ
యుద్దమాడి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ
సూర్యుడుద్బ వింపగఆ ఆ ఆ హల్లెలూయ
చీకటుల్ గతించెనుఆ ఆ ఆ హల్లెలూయ
3.బండ,ముద్ర,కావలిఆ ఆ ఆ హల్లెలూయ
అన్ని వ్యర్ద మైనవిఆ ఆ ఆ హల్లెలూయ
యేసు నరకంబునుఆ ఆ ఆ హల్లెలూయ
గెల్చి ముక్తి దెచ్చెనుఆ ఆ ఆ హల్లెలూయ
4.క్రీస్తు లేచినప్పుడుఆ ఆ ఆ హల్లెలూయ
చావుముల్లు త్రుంచెనుఆ ఆ ఆ హల్లెలూయ
ఎల్లవారి బ్రోచునుఆ ఆ ఆ హల్లెలూయ
మ్రుత్యువింక గెల్వదుఆ ఆ ఆ హల్లెలూయ
గగనము చీల్చుకొని
పల్లవి:గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని
వేలాది దూతలతో భువికి వేగమె రానుండె
1.పరలోక పెద్దలతో పరివారముతో కదలి
ధర సంఘ వదువునకై తరలెనువరుడదిగో…గగనము…
2.మొదటను గొర్రెగను ముదమారగ వచ్చెను
కొదమసిం హపురీతి కదలెనుగర్జనతో…గగనము…
3.కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు
ప్రథమమున లేచదరు పరిశుద్దులుమృతులు…గగనము…
గీతం గీతం జయ జయ గీతం
పల్లవి:గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము ఆ ఆ
యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
1.చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలినిల్చెను నా - దైవ సుతుని ముందు||గీతం||
2.వలదు వలదుయేడువవలదు - వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రకటించుడి||గీతం||
3.అన్న కయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి
ఇంక భూతగణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి||గీతం||
4.గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి - జయ వీరుడు రాగా
మీ వేళతాళ వాద్యముల్ - బూరలెత్తి ధ్వనించుడి||గీతం||
గెత్సేమనే తోటలో
పల్లవి:గెత్సేమనే తోటలో - ప్రార్ధింప నేర్పితివా
ఆ ప్రార్దనే మాకునిలా - రక్షణను కలిగించెను
ఆ...ఆ...ఆ...ఆ...||గెత్సేమనే||
1.నీ చిత్తమైతే ఈ గిన్నెను - నా యెద్ద నుండి తొలగించుమని
దు:ఖంబులో భారంబుతో ప్రార్ధించితివా తండ్రి||గెత్సేమనే||
2.ఆ ప్రార్దనే మాకు నిలా - నీ రక్షణ భాగ్యంబు కలిగించెను
నీ సిలువే మాకు శరణం - నిన్న నేడు రేపు మాకు||గెత్సేమనే||
చిరకాల స్నేహితుడా
పల్లవి:చిరకాల స్నేహితుడా,నా హృదయాన సన్నిహితుడా(2X)
నా తోడునీవయ్యా,నీ స్నేహంచాలయ్యా
నా నీడనీవయ్యా,ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం,ఇధి నా యేసుస్నేహం(2X)
1.బంధువులు వెలివేసిన,వెలివేయనిస్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్యస్నేహం,నాయేసునిస్నేహం
చిరకాల స్నేహం,ఇధి నా యేసుస్నేహం(2X)
2.కష్టాలలో,కన్నీళ్లలో,నను మోయునీ స్నేహం
నను ధైర్యపరచిఆదరణ కలిగించు,నాయేసునిస్నేహం
చిరకాల స్నేహం,ఇధి నా యేసుస్నేహం(2X)
3.నిజమైనది,విడువనిధి,ప్రేమించు నీ స్నేహం
కలువరిలొ చూపిన,ఆ సిలువ స్నేహం,నాయేసునిస్నేహం
చిరకాల స్నేహం,ఇధి నా యేసుస్నేహం(2X)
…చిరకాల స్నేహితుడా…
జయము క్రీస్తూ
పల్లవి:జయము క్రీస్తూ -జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
జయము క్రీస్తూ -జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో
సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో
జయము క్రీస్తూ -జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
1.దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి
దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి
సాతానుని జాడ - సిలువలోనే దునుమాడ
జయగీతం రహిబాడ||జయము||
2.పాతాళము నొంచి - పరలోకము దెరచి
పాతాళము నొంచి - పరలోకము దెరచి
పాపాత్ముల కెంత - భాగ్యమెంచెక్షమియించె
పాడుదమా స్తుతియించి||జయము||
జయహే జయహే
పల్లవి:జయహే జయహే జయహే జయహే - జయ జయ దేవ సుథ
జయ జయ విజయ సుథ-జయహే జయహే జయహే జయహే
1.సిలువలో పాపికి విడుదల కలిగెను,విడుదల కలిగెను
కలువరిలో నవ జీవన మొదవిను,జీవన మొదవిను
సిలువ పతాకకు జయమును గూర్చెను -సిలువ పతాకకు జయమును గూర్చెను
జయమని పాడెదను - నీ విజయము పాడెదను..నావిజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే
2.శోధనలలో ప్రభు సన్నిధి దొరికెను,సన్నిధి దొరికెను
వేదనలే తన భూమిగా మారెను,భూమిగా మారెను
శోధన భాధలు బలమును గూల్చెను -శోధన భాధలుబలమును గూల్చెను
జయమని పాడెదను - నీ విజయము పాడెదను ..నావిజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే
3.స్వాన్తములో నిజ శాంతము లభించెను,శాంతిలభించెను
భ్రాంతులు వింతగా ప్రభు పర మాయెను,ప్రభు పర మాయెను
స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను -స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను
జయమని పాడెదను - నీ విజయము పాడెదను ..నావిజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే - జయ జయ దేవ సుథ
జయ జయ విజయ సుథ-జయహే జయహే జయహే జయహే
జీవనదిన ి నా హృదయములో ప్రవహింప
పల్లవి:జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా(2X)
1.శరీరక్రియులన్నియు నాలో నశియించేయుమయు(2X)
2.బలహీన సమయుములో నీ బలము ప్రసాదించుము(2X)
3.ఆత్మీయవరములతో నన్ను అభిషేకం చేయుమయ(2X)
4.ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ(2X)
తర తరాలలో
పల్లవి:తర తరాలలో,యుగ యుగాలలో,జగ జగాలలో
దేవుడు ...దేవుడు ...యేసే దేవుడు ఆ ..ఆ .. ఆ ..
హల్లెలూయ ..హల్లెలూయ ..హల్లెలూయ..
1.భూమిని పుట్టింపక మునుపు-లోకము పునాది లేనపుడు..దేవుడు…
2.సృష్టికి శిల్పాకారుడు-జగతికి ఆది సంభూతుడు..దేవుడు…
3.తండ్రి కుమార ఆత్మయు-ఒకటై యున్నా రూపము..దేవుడు…
దేవా నీకు స్తోత్రము
దేవా నీకు స్తోత్రము - యిచ్చావు నాకొక దినము
దేవా నీకు స్తోత్రము - యిచ్చావు నాకొక దినము
దీవించుము - నను ఈ దినము
దీవించుము - నను ఈదినము
జీవింతు నే నీకోసము
జీవింతు నే నీకోసము
ఆ ..ఆమెన్!ఆ ..ఆమెన్!ఆ ..ఆమెన్
దేవుని వారసులం
పల్లవి:దేవుని వారసులం - ప్రేమనివాసులము
జీవన యాత్రికులం - యేసుని దాసులము
నవ యుగ సైనికులం - పరలోక పౌరులము
హల్లెలూయ - నవ యుగ సైనికులం - పరలోక పౌరులము
1.దారుణ హింస లలో - దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో - ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో - సర్వత్ర యేసుని కీర్తింతుము
2.పరిశుద్దాత్మునికై - ప్రార్థన సలుపుదము
పరమాత్ముని రాక - బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై - సర్వాంగ హోమము జేయుదము
3.అనుదిన కూటములు - అందరి గృహములలో
ఆనందముతోను - ఆరాధనలాయే
వీనుల వినదగు పాటలతో - ధ్యానము చేయుచు మరియుదము
దైవం ప్రేమ స్వరూపం(F#)
పల్లవి:దైవం ప్రేమ స్వరూపం-ప్రేమకు భాష్యం-శ్రీయేసుడే–అవనిలో
దైవం ప్రేమ స్వరూపం-ప్రేమకు భాష్యం–శ్రీయేసుడే
ఆ..ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం
ఆ….ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం…దైవం…
1.ఈ ధరలో ప్రేమ శూన్యం - ఆదరణలేని గమ్యం
ఈ ధరలో ప్రేమ శూన్యం - ఆదరణలేని గమ్యం
మధురంపు యేసు ప్రేమ - మదినింపు మధుర శాంతి
మధురంపు యేసు ప్రేమా- మదినింపు మధుర శాంతి…దైవం…
2.కరుణించి క్రీస్తు నీకై - మరణించే సిలువ బలియై
కరుణించి క్రీస్తు నీకై - మరణించే సిలువ బలియై
పరలోక దివ్య ప్రేమన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్
పరలోక దివ్య ప్రేమాన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్…దైవం…
నన్నెంతగానో ప్రేమించెను
పల్లవి:నన్నెంతగానో ప్రేమించెను - నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు - నా పాపము - నా శాపము
తొలగించెను - నన్నుకరుణించెను(2X) ..నన్నెంతగానో..
1.సాతాను బంధాలలో - జీవంపు డంబాలలో(2X)
పడనీయక - నన్ను చెడనీయక(2X)
తన క్రుపలో నిరతంబు నన్ను నిల్పెను(2X) ..నన్నెంతగానో..
2.సత్యంబు జీవంబును - ఈ బ్రతుకు సాఫల్యము(2X)
నేర్పించెను - నాకు చూపించెను(2X)
వర్ణించగాలేను ఆ ప్రభువును(2X) ..నన్నెంతగానో..
3.కల్వరి గిరిపైనను - ఆ సిలువ మరణంబును(2X)
నా కోసమే - తాను శ్రమ పొందెను(2X)
నా పాపమంతటిని క్షమియించెను(2X) ..నన్నెంతగానో..
4.ఘనమైన ఆ ప్రేమకు - వెలలేని త్యాగంబుకు(2X)
ఏమిచ్చెదన్ - నేనేమిచ్చెదన్(2X)
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును(2X) ..నన్నెంతగానో..
నా పేరే తెలియని ప్రజలు
పల్లవి:నా పేరే తెలియని ప్రజలు-ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప-కొందరే ఉన్నారు(2X)
ఎవరైనా-మీలో ఎవరైనా-వెళతారా - నా ప్రేమను చెబుతారా(2X)
1.రక్షణ పొందని ప్రజలు - లక్షల కొలది ఉన్నారు
మారుమూల గ్రామాల్లో - ఊరి లోపలి వీధుల్లో(2X)..ఎవరైనా..
2.నేను నమ్మిన వారిలో - కొందరు మోసం చేసారు
వెళతామని చెప్పి - వెనుకకు తిరిగారు(2X)..ఎవరైనా..
3.వెళ్ళగలిగితే మీరు - తప్పక వెళ్ళండి
వేల్లలేకపోతే - వెళ్ళేవారిని పంపండి(2X)..ఎవరైనా..
నా యేసు రాజుతో నేను సాగి పోదును
పల్లవి:నా యేసు రాజుతో నేను సాగి పోదును(2X)
సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను(2X)
సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను(2X)
నే క్రీస్తులో జయించెదను - నే క్రీస్తులో జయించెదను
అఅహా అఅహాహల్లెలూయ(3X)
హల్లెలూయహల్లెలూయ
1.శత్రు సమూహము నను చుట్టినా - లోకము నన్ను నిందించినా(2X)
యెహోవ నిస్సీ నా ధ్వజము - నాకు తోడై జయ మిచ్చును(2X)
నాకు తోడై జయ మిచ్చును.. సాతనును పార ద్రోలెదను ..
2.శోధన సంద్రము వలె పొంగినా - వ్యాధిబాధలు కృంగదీసినా(2X)
యెహోవ రాఫా నాకు స్వస్థత నిచ్చి నన్ను నడిపించును(2X)
స్వస్థత నిచ్చి నడిపించును.. సాతనును పార ద్రోలెదను ..
3.ధన సంపదలు నను విడచినా - బంధు మిత్రులు నను మరచినా(2X)
యెహోవ రోఫీ నా కాపరి - నన్ను కాచి నడిపించును(2X)
నన్ను కాచి నడిపించును.. సాతనును పార ద్రోలెదను ..
నా యేసు రాజుతో నేను సాగి పోదును(2X)
సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను(2X)
సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను(2X)
క్రీస్తులో జయించెదను - నే క్రీస్తులో జయించెదను
అఅహా అఅహాహల్లెలూయ(3X)
హల్లెలూయహల్లెలూయ
హల్లెలూయహల్లెలూయ
నిన్నే ప్రేమింతును
పల్లవి:నిన్నే ప్రేమింతును,నిన్నే ప్రేమింతును-యేసు
నిన్నే ప్రేమింతును,నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి,నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
1.నిన్నే పూజింతును,నిన్నే పూజింతును-యేసు
నిన్నే పూజింతును,నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి,నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
2.నిన్నే కీర్తింతును,నిన్నే కీర్తింతును-యేసు
నిన్నే కీర్తింతును,నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి,నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ
3.నిన్నే ప్రార్దింతును,నిన్నే ప్రార్దింతును-యేసు
నిన్నే ప్రార్దింతును,నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి,నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
నిత్యుడైన దేవుని(E)
పల్లవి:నిత్యుడైన దేవుని తోడు నీడ-నీపై ఉoడును
నిత్యము నిల్చును(5X)
1.ఎర్ర సముద్రమును-ఎడారి చేయువాడు(2X)
మారా జలములను-మాధుర్యముగ జేయును(2X)
…నిత్యుడైన…
2.ఫారో సైన్యములు-పరుషాలు పల్కినను(2X)
ప్రవాహ జలములలో-పడి చావజేసెను(2X)
…నిత్యుడైన…
3.బలవంతుడైన దేవుడు-ఎల్ల కాలము బలమిచ్చును(2X)
మార్గాన నడిపించును-మన్నాతో పోషించును(2X)
…నిత్యుడైన…
నిలిచె నీ రేయీ
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో-ఈ భువిలో
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో-ఈ భువిలో
(It Came Upon a Midnight Clear Music bit)
1.ఆ తల్లి మరియ-నీ రూపుజూచి - లాలించె మొదమెంచె నెంతో(Female)
ఆ బాలుడేసు-మా దేవుడంచు-చాటించిరి-ఈ భువిలో(Male)
(music bit)
ఆ తల్లి మరియ-నీ రూపుజూచి - లాలించె మొదమెంచె నెంతో(Female)
ఆ బాలుడేసు-మా దేవుడంచు-చాటించిరీ భువిలో(Male)
దివిలోనూ-భువిలోనూ-జయగీతం-మ్రోగెనూ
దివిలోనూ-భువిలోనూ-జయగీతం-మ్రోగెనూ
వెచ్చనీ కాంతిలోన వెల్గే నీ లోకమా రారాజువై నిలిచిపో ఈ భువిలో(Female)
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో-ఈ భువిలో
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో-ఈ భువిలో
(It Came Upon a Midnight Clear Music bit)
2.ఆ తూర్పు తార-మార్గంబుజూపెన్-పయనించిరి జ్ఞాన త్రయము(Female)
పాపులకు రక్షణ-కలుగునని నమ్మి-ప్రకటించిరీ సువార్త(Male)
(music bit)
ఆ తూర్పు తార-మార్గంబుజూపెన్-పయనించిరి జ్ఞాన త్రయము(Female)
పాపులకు రక్షణ-కలుగునని నమ్మి-ప్రకటించిరీ సువార్త(Male)
దివిలోనూ-భువిలోనూ-జయగీతం-మ్రోగెనూ
దివిలోనూ-భువిలోనూ-జయగీతం-మ్రోగెనూ
వెచ్చనీ కాంతిలోన వెల్గే నీ లోకమా రారాజువై నిలిచిపో ఈ భువిలో(Female)
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో-ఈ భువిలో
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో-ఈ భువిలో
నిలిచిపో-ఈ భువిలో
నిలిచిపో-ఈ భువిలో
3.దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకై ఆకలి నీకుందా(2X)
యేసు నాథునితో సహవాసం నీకుందా..రాకడ..
నీటి యూటయొద్ద నాట బడితిమి
పల్లవి:నీటి యూటయొద్ద నాట బడితిమి-వేరుతన్ని ఎదిగి ఫలియింతుము
చింత పడము మాకాపుమానము-యేసు కృప చాలును..నీటి..
1.పాపం పోయెను హల్లెలూయ-యేసు లేచెను హల్లెలూయ
యేసు వచ్చెను హల్లెలూయ-స్తుతి గీతం పాడుదము..నీటి..
2.యేసే మార్గము హల్లెలూయ-యేసే సత్యము హల్లెలూయ
యేసే జీవము హల్లెలూయ-యేసు వార్తను చాటుదము..నీటి..
3.వాక్య ధ్యానము హల్లెలూయ-ప్రార్థనాత్మతో హల్లెలూయ
ఏకత్వముతో హల్లెలూయ-సహవాసం కోరుదమా..నీటి..
నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు(Dm)
పల్లవి:నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది(2X)
నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్త్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా(2X)
1.పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి(2X)
నా అడుగులు స్థిర పరచి బలము నిచ్చితివి
నీదు అడుగు జాడలనే వెంబడింతుప్రభు
ఇలలో వెంబడింతుప్రభూ
…నా ప్రాణమా…
2.ఆంధకారపు లోయలలో నేను నడిచినను
ఏ అపాయము రాకుండ నన్ను నడిపితివి(2X)
కంటిపాపగనీవని నిన్ను కొలిచితివి
కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను
ఇలలో నిన్ను కొలిచెదను
…నా ప్రాణమా…
నీవు నిర్మించిన దేవాలయములో(F)
పల్లవి:నీవు నిర్మించిన దేవాలయములో నీతో జత పనివారము
నీ ప్రత్యక్షతగల పరిశుద్దాలయంలో నిన్ను మహిమ పరచెదము(2X)
హల్లెలూయ హల్లెలూయహల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయహల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయహల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయహల్లెలూయ
మహిమా ప్రభావములు నీకే చెల్లున్
1.నిరంతరము నియమముతో నిండు హృదయ కృతజ్ఞతతో(2X)
నీరీక్షణతో స్తోత్రములతోను నిత్యుండగు దేవా రాదింతుము(2X)
…హల్లెలూయ…
2.నీ సంఘమూ ఈబండపైన నిలువనిమ్ము క్రీస్తు ప్రభూ(2X)
నీ వాక్యముతో మమ్ము నింపుము నీతి మార్గములో నడుపుము దేవా(2X)
…హల్లెలూయ…
3.నిర్దోషమైన నిర్మలమైన నీ రక్తముతో మమ్ము పొందితివి(2X)
నీవే ప్రభువా తరతరములాకు నీవాస స్థలముగా ఉన్నావు(2X)
…హల్లెలూయ…
నీ స్వరము వినిపించు ప్రభువా
పల్లవి:నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్
నీ వాక్యమును నేర్పించు దానియందు నడచునట్లు నీతో..నీ..
1.ఉదయముననే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు నను సిద్దపరచు రక్షించు ఆపదల నుండి..నీ..
2.నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు సరి జేసుకొందు
నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు..నీ..
3.భయ భీతులతో తుఫానులలో నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను..నీ..
4.నాతో మాట్లాడు స్పస్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో సరిజేసుకొందు నీ దివ్య వాక్యముద్వారా..నీ..
నీలాకాశంలోన
పల్లవి:నీలాకాశంలోన నింగికెగసెతార(2x)
ఆ తార వెలుగు గమనం బాల యేసు జననం(2x)
ఆనందం ఆనందం అరుణోదయానందం
నా హ్రుధిలో నా మదిలోఅరుణోదయానందం
1.ప్రవచనము నెరవేరిన రోజుకన్నియగర్భాన మెరిసిన కాంతుల్(2x)
సంతోష సంబ్రాలు నిండిన రోజుహృదయ కాంతితో స్తంభించిన రోజు||నీలాకాశంలోన||
మహోన్నత మైన స్థలములలో దేవునికి మహిమదేవునికిమహిమ
2.గొల్లలు జ్ఞానులు సంభ్రముతోతపియించిరి వరపుత్రుని బోసి నవ్వులన్(2x)
నీ క్రుపాసనంబు నొద్ద దు:ఖము తీరఆదరించుమా ప్రేమసాగరా||నీలాకాశంలోన||
నీ శిలువలోనే నాముక్తీ
పల్లవి:నీ శిలువలోనే నాముక్తీ-నీ నీడలోనే నా జీవితం
నీ శిలువలోనే నాముక్తీ-నీ నీడలోనే నా జీవితం - నీ శిలువలోనే
1.నా కనుపాపగా నీవున్నావని - నా మదిలోని మమతవు నీవని
నీ రక్తముతో నను కొన్నావనినీ రక్తముతో నను కొన్నావని
నిరతం కొలుతును ఇలనిను దేవా
నిరతం కొలుతును ఇలనిను దేవానీ శిలువలోనే
2.సర్వ లోకాల పాపాలు మోయ - స్వామీ నీవే బలి అయితివే
సమర్పింతు తండ్రి నా హృదయమును - సమర్పింతు తండ్రి నా హృదయమును
సంపూర్ణ శాంతినాకిమ్ముదేవా -సంపూర్ణ శాంతినాకిమ్ముదేవా
నీ శిలువలోనే నాముక్తీ-నీ నీడలోనే నా జీవితం
నీ శిలువలోనే నాముక్తీ-నీ నీడలోనే నా జీవితం - నీ శిలువలోనే
నీవుంటేనాకు చాలు యేసయ్య
పల్లవి:నీవుంటేనాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా
నీవుంటేనాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా
నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా
నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా
నీవుంటేనాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా
నీవుంటేనాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా
1.ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన-నిష్టూర మైనను
ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన-నిష్టూర మైనను..నీ మాట..
2.బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను
అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన
బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను
అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన..నీ మాట..
3.ఆస్తులన్ని పోయినా అనాధగామిగిలినా
ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా
ఆస్తులన్ని పోయినా అనాధగామిగిలినా
ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా..నీ మాట..
4.నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము
నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము..నీ మాట..
నే పాపినో ప్రభువా
పల్లవి:నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా
నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా(2X)
1.కరుణాలవాలా - నీ మ్రోల నేలా - తల వాల్చి నిలిచేనులే(2X)
దయ చూడు చాలా - దురితాల ద్రోలా - నీ సాటి దైవంబు లేరవ్వరు
లేరవ్వరు||నే పాపినో||
2.వుదయించినావు - సదయుండ నీవు - ముదమార మా కొరకై(2X)
మోసీవు సిలువ - నీ ప్రేమ విలువ నా తరమా చెల్లించ - నా యేసువా
నా యేసువా||నే పాపినో||
పరమ జీవము
1.పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును - మరల వచ్చి యేసు కొని పోవును
పల్లవి:యేసు చాలును - యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును
2.సాతాను శోధనలధికమైన -సొమ్మసిల్లక సాగి వెళ్ళదను
లోకము శరీరము లాగినను - లోబడక నేనువెళ్ళదను..యేసు..
3.పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును
4.నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము కుళ్ళి కృశించినను
హరిన్చినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడచినను..యేసు.
పరమ పావనుడు
పల్లవి:పరమ పావనుడు మరియ తనయుడుఅవతరించెనే శుభ దినాన(2x)
మది పరవశానఉప్పోంగగపరవశానఉప్పోంగగ
అందించెదను ప్రేమ సందేశంఅందించెదనుక్రిస్మస్సందేశం||పరమ||
1.దూత గణములెల్ల మదినాలపింపగాగొల్లలుస్తుతులనుఅర్పింపగ(2x)
వినరండి బాల యేసుని దివ్యగాథను
కనరండి దైవ తనయుని ఇమ్మానుయేలును||పరమ||
2.తారలు కాంతులు జగమంత వెదజల్లగజ్ఞానులు కానుకలర్పింపగ(2x)
అర్పించెదనునా జీవితం రక్షణ మార్గం వెదజల్లగ||పరమ||
ప్రభువానీకార్యములు(Ab)
పల్లవి:ప్రభువానీకార్యములుఆశ్చర్యకరమైనవి
దేవానీదుక్రియలుఅద్బుతములైయున్నవి(2X)
నేపాడెదన్నేచాటెదన్నీదు నామంభువిలో
సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా(2X)
1.హాలేలూయ హాలేలూయ
భరియింపరానిదు:ఖములుయిహమందు నను చుట్టిన
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి(2X)
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా యిలలో జీవింతును
సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా(2X)
2.హాలేలూయ హాలేలూయ
లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి(2X)
నిర్దోషిగ చేయుటకై నీవు ధోషివైనావు
నీదు సాక్షిగా యిలలో జీవింతును
సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా(2X)
ప్రభువానీకార్యములుఆశ్చర్యకరమైనవి
దేవానీదుక్రియలుఅద్బుతములైయున్నవి(2X)
నేపాడెదన్నేచాటెదన్నీదు నామంభువిలో
సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా(2X)
పరిశుద్ధ పరిశుద్ధ
పల్లవి:పరిశుద్ధ పరిశుద్ధ = పరిశుద్ధ ప్రభువా =
వరదూతలైన నిన్ = వర్ణింప గలరా..పరిశుద్ధ..
1.పరిశుద్ధ జనకుడ = పరమాత్మ రూపుడ =
నిరుపమ బలబుద్ధి = నీతి ప్రభావా..పరిశుద్ధ..
2.పరిశుద్ధ తనయుడ = నరరూపధారుడ =
నరులను రక్షించు = కరుణా నముద్రా..పరిశుద్ధ..
3.పరిశుద్ధ మగు నాత్మ = వరము లిడు నాత్మ =
పరమానంద ప్రేమ = భక్తుల కిడుమా..పరిశుద్ధ..
4.జనకకుమారాత్మ = లను నేక దేవ =
ఘనమహిమచెల్లును = దనర నిత్యముగా..పరిశుద్ధ..
పాడెదము వేడెదము(Cm)
పల్లవి:పాడెదము వేడెదము యేసు నామము
వేడెదము కొనియాడెదము క్రీస్తు నామము
1.ఈ లోక మందునా అంథకార మందునా(2X)
దేవా నీవే నాకు దివ్యమైన జ్యోతివి
..పాడెదము ..
2.శ్రమలెన్ని వచ్చినా బాధలెన్ని చుట్టినా(2X)
దేవా నీవే నాకు ఆశ్రయము దుర్గము
..పాడెదము ..
3.ఈ లోక ఆశలన్ విడనాడే మనస్సును(2X)
దేవా నీవే నాకు దయ చేయుమూ దినదినం
..పాడెదము ..
ప్రార్ధన వినెడి పావనుడా
పల్లవి:ప్రార్ధన వినెడి పావనుడా-ప్రార్ధన మాకు నేర్పుమయా..ప్రార్ధన..
1.శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్యబృందముకు నేర్పితివి
పరముడ నిన్ను–ప్రణుతించెదము–పరలోక ప్రార్ధన నేర్పుమయా..ప్రార్ధన..
2.పరమ దేవుడవని తెలిసి - కరము లెత్తి జంటగమోడ్చి = శిరమును
వంచి సరిగమ వేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయా..ప్రార్ధన..
3.దినదినంబు చేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ = దీనుడవయ్యు
దిటముగకొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయా..ప్రార్ధన..
4.శత్రుమూక నిను చుట్టుకొని - సిలువపై నిను జంపగను
శాంతముతో నీ-శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా..ప్రార్ధన..
భాసిల్లెను శిలువలో
పల్లవి:భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా
భాసిల్లెను శిలువలో పాపక్షమా
1.కలువరిలో నా పాపము పొంచి - శిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహర కరుణించితివి-కలుషహరహరుణించితివి
భాసిల్లెను శిలువలో పాపక్షమా
2.నమ్మిన వారిని కాదనివనియు-నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితినీపాదంబులను -నమ్మితినీపాదంబులను
భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా
భాసిల్లెను శిలువలో పాపక్షమా
మహోదయంశుభోదయం
పల్లవి:మహోదయంశుభోదయంసర్వలోకానికరుణోదయం
శ్రీయేసు రాజు జన్మ దినంభూప్రజలెల్లరి హృదయానందం
1.సర్వలోకాన సువార్త తెల్పభువికేతించిన మరియ పుత్రుడు
క్రుపామయుడు సత్య సంపూర్ణుడుక్రీస్తేసు రాజు జన్మ దినం
ఆ హల్లేలుయా ఆ హల్లేలుయాఆ హల్లేలుయా ఆ హల్లేలుయా(2x)
2.ఘోర పాపములోనున్న జనులకుపరలోక జీవ మార్గము చూప
కరుణామయుడు ఇమ్మానుయేలుఅవతరించిన శుభోదయం
ఆ హల్లేలుయా ఆ హల్లేలుయాఆ హల్లేలుయా ఆ హల్లేలుయా(2x)
మరణము గెలిచెను మన ప్రభువు
పల్లవి:మరణము గెలిచెను మన ప్రభువు–మనుజాళి రక్షణ కోసమూ(2X)
ఎంత ప్రేమ,ఎంత త్యాగం,జయించెసమాధినీ(2X)
మరణము గెలిచెను మన ప్రభువు - మనుజాళి రక్షణ కోసమూ
1.పాపపు ఆత్మల రక్షణకై - గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై(2X)
నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు(2X)
ఎంత జాలి,ఎంత కరుణ యికను మనపైన(2X)
మరణము గెలిచెను మన ప్రభువు - మనుజాళి రక్షణ కోసమూ(2X)
2.నేడే పునరుద్దాన దినం - సర్వ మానవాళికి పర్వ దినం(2X)
పాపపు చెర నుండి విడుదల(2X)
ఎంతధన్యం,ఎంత భాగ్యం - నేడే రక్షణ దినం(2X)
మరణము గెలిచెను మన ప్రభువు - మనుజాళి రక్షణ కోసమూ(2X)
మంచి సాక్షిగ మార్చుము
పల్లవి:మంచి సాక్షిగ మార్చుము - నా దేవా,సిలువ సాక్షిగ నిలువనీ -నా దేవా
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా,సిలువ సాక్షిగ నిలువనీ -నా దేవా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా,సిలువ సాక్షిగ నిలువనీ -నా దేవా
1.నాపై కనపరిచిన నీ ప్రేమను - పాపినైన నాకైఅర్పించిన నీ జీవం
నాపై కనపరిచిన నీ ప్రేమను - పాపినైన నాకైఅర్పించిన నీ జీవం
నలిగిన ప్రతి హృదయానికి -ప్రకటింప సెలవియ్యవా
నలిగిన ప్రతి హృదయానికి -ప్రకటింప సెలవియ్యవా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా,సిలువ సాక్షిగ నిలువనీ -నా దేవా
2.నా జీవిత కాలమంత నమ్మికగా,నీ సన్నిధిలో మంచి వాసునిగా
నా జీవిత కాలమంత నమ్మికగా,నీ సన్నిధిలో మంచి వాసునిగా
నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా
నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా,సిలువ సాక్షిగ నిలువనీ -నా దేవా
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా,సిలువ సాక్షిగ నిలువనీ -నా దేవా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
మంచి సాక్షిగ మార్చుము
పల్లవి:మంచి సాక్షిగ మార్చుము - నా దేవా,సిలువ సాక్షిగ నిలువనీ -నా దేవా(2X)
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా(2X)
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా,సిలువ సాక్షిగ నిలువనీ -నా దేవా
1.నాపై కనపరిచి నీ ప్రేమను - పాపినైన నాకైఅర్పించిన నీ జీవం(2X)
నలిగిన ప్రతి హృదయానికి -ప్రకటింప సెలవియ్యవా(2X) .యేసయ్య..
2.నా జీవిత కాలమంత నమ్మికగా,నీ సన్నిధిలో మంచిదాసునిగా(2X)
నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా(2X)..యేసయ్య..
మందలో చేరని గొర్రెలెన్నో
పల్లవి:మందలో చేరని గొర్రెలెన్నో- కోట్ల కొలదిగా కలవు యిల
ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంఘమా
రమ్మనే యేసు ప్రార్ధించుము - నడిపించును
1.అడవులలో పలు స్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్
వారి నిమిత్తమై శ్రమ పడితి - మరి వారిని వెదకెడు వారెవరు
2.అడవులలో పలు స్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్
వారి నిమిత్తమై శ్రమ పడితి - మరి వారిని వెదకెడు వారెవరు
3.నాకై పలికెడి నాలుకలు - నావలె నడిచెడి పాదములు
నన్ను ప్రేమించెడి హృదయములు - నాకు కావలె నీ విచ్చెదవా
యెహోవ నా కాపరి(Fm)
పల్లవి:యెహోవ నా కాపరి .. యెహోవ నా ఊపిరి,నాకు లేమి,ఏమి
లోయలలో .. లోతులలోయెహోవ నా కాపరి
సంద్రములో .. సమరములో యెహోవ నా కాపరి(2X)
1.పచ్చిక గల చోట్ల .. నన్ను పరుండ జేయును(2X)
శాంతి కరమైన జలములకు .. నన్ను నడిపించును(2X)
…లోయలలో…
2.గాడాంధకారపు లోయలలో -- సంచరించినను(2X)
అపాయమే కలుగదు నాకు .. నీ తోడు నా కుండగ(2X)
…లోయలలో…
3.చిర కాలము నేను..యెహోవ సన్నిధిలో(2X)
నివాసముండెదను నేను -- నిత్యము జీవింతును(2X)
…లోయలలో…
యెహోవానీ నామము
పల్లవి:యెహోవానీ నామము-ఎంతో బలమైనది ...ఆ...ఆ...ఆ...
యేసయ్య నీ నామము - ఎంతో ఘనమైనది...ఆ...ఆ...ఆ...||యెహోవా||
1.మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
యెహోషువాప్రార్ధించగా-సూర్యచంద్రుల నాపితివి||యెహోవా||
2.నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా - భయమేమిలేకుండిరి||యెహోవా||
3.సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము||యెహోవా||
4.చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా
సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళువిడిపోయెను||యెహోవా||
యేసు రక్తము రక్తము రక్తము
పల్లవి:యేసు రక్తము రక్తము రక్తము-యేసు రక్తము రక్తమురక్తము
అమూల్యమైన రక్తము-నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తమురక్తము
యేసు రక్తము రక్తమురక్తము
1.ప్రతి ఘోర పాపమును కడుగును-మన యేసయ్య రక్తము
ప్రతి ఘోర పాపమును కడుగును-మన యేసయ్య రక్తము
బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే
బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే
యేసు రక్తము రక్తము రక్తముయేసు రక్తము రక్తమురక్తము
అమూల్యమైన రక్తము-నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తమురక్తము
2.మనః సాక్షిని శుద్ధి చేయును -మన యేసయ్య రక్తము
మనః సాక్షిని శుద్ధి చేయును -మన యేసయ్య రక్తము
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను
యేసు రక్తము రక్తము రక్తము-యేసు రక్తము రక్తమురక్తము
అమూల్యమైన రక్తము-నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము-యేసు రక్తము రక్తమురక్తము
అమూల్యమైన రక్తము-నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తమురక్తము
3.మహా పరిశుద్ద స్థలములో చేర్చును -మన యేసయ్య రక్తము
మహా పరిశుద్ద స్థలములో చేర్చును -మన యేసయ్య రక్తము
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగావెళ్ళెను
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగావెళ్ళెను
యేసు రక్తము రక్తము రక్తము-యేసు రక్తము రక్తమురక్తము
అమూల్యమైన రక్తము-నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము-యేసు రక్తము రక్తమురక్తము
యెహోవా దయాళుడు
పల్లవి:యెహోవా దయాళుడు
ఆయనకే కృతజ్ఞత-స్తుతి చెల్లించుడి
కృతజ్ఞత లర్పించుడి-స్తుతులను చెల్లించుడి
1.నాకము వర్షించినా-లోకము నశించినా
మీకు అండగా-నిలిచిన విభునకు
కృతజ్ఞత లర్పించుడి-స్తుతులను చెల్లించుడి
2.కరువులు కలిగినను-మరణము వచ్చినను
కరుణతో కొరతలను-తీర్చిన ప్రభునకు
కృతజ్ఞత లర్పించుడి-స్తుతులను చెల్లించుడి
3.ఆపదలే రానీ-అపనిందలే గానీ
కాపరియై మిమ్ము-గాంచిన క్రీస్తుకు
కృతజ్ఞత లర్పించుడి-స్తుతులను చెల్లించుడి
యేసు నీ క్రుపలో
పల్లవి:యేసు నీ క్రుపలో మము కాపాడుము దేవా
మమ్ము రక్షించి నిత్య రాజ్యములో
నడుపము మా ప్రభువా - నడుపుము మా ప్రభువా ...యేసు ...
1.కృంగిన వేళలలో - అలసిన సమయములో
నా చేయి విడువకను - నన్ను నిలబెట్టు
నన్ను నీ ఆత్మతో పూర్ణముగా చేసి
నిలుపుము జ్యోతివలె - నిలుపుము జ్యోతివలె...యేసు ..
2.సిలువను మోసికొని - సువార్త చాటింప
విలువగు నీ శక్తిచే - నిత్యము నడిపించు
యేసు నీ రాకడలో - నిన్ను ఎదుర్కొనుటకు
నీ కృప నీయుమయా - నీ కృప నీయుమయా...యేసు ..
యేసు రక్తము రక్తము రక్తము
పల్లవి:యేసు రక్తము రక్తము రక్తము-యేసు రక్తము రక్తమురక్తము
అమూల్యమైన రక్తము-నిష్కళంకమైన రక్తము
…యేసు…
1.ప్రతి ఘోర పాపమును కడుగును-మన యేసయ్య రక్తము(2X)
బహు దుఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే(2X)
…యేసు…
2.మనః సాక్షిని శుద్ధి చేయును -మన యేసయ్య రక్తము(2X)
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను(2X)
…యేసు…
3.మహా పరిశుద్ద స్థలములో చేర్చును -మన యేసయ్య రక్తము(2X)
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగావెళ్ళెను(2X)
…యేసు…
రండహో వినరండహో(Bbm)
పల్లవి:రండహో వినరండహో శుభ వార్త ఒకటి వినిపించెదం
సంతోషముతో దరి చేరండి సంభ్రాలతోయికస్తుతి కలపండి(2X)
..రండహో
1.అలనాడు బెత్లేహేము పశుల పాకలో
కన్నియ మరియకు శిశువు పుట్టెను(2X)
గొల్లలు జ్ఞానులు కానుకలతో స్తుతులర్పించిరి(2X)||రండహో||
2.ప్రవచనమునుబట్టిఅభిషక్తుడవతరించె
భూరాజులకదిఎంతోభీతి కలిగించెన్(2X)
అంతము చేయ దలచినంత దూతగణంరక్షించెన్(2X)
సంభ్రాలతోయికశృతి కలపండి||రండహో||
3.నాటి నుండి నేటి వరకు కృపతో తోడుండి
పరమందు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నా(2X)
యేసుని జన్మశుభాశిస్సులందుకొనరండి(2X)
సంభ్రాలతోయికశృతికలపండి||రండహో||
రండి! యెహోవాను గూర్చి(Bm)
పల్లవి:రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము(2X)
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని(2X)
ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా(2X)
1.కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా(2X)
ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో(2X)
...రండి…
2.విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో(2X)
అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో(2X)
...రండి…
3.త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాథుడని(2X)
నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము(2X)
...రండి…
రాకడ సమయములో
పల్లవి:రాకడ సమయములో కడబూర శబ్దంలో
యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా
రావయ్య యేసయ్య వేగమే రావయ్యా
రావయ్య యేసయ్య వేగమే రావయ్యా
1.యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా(2X)
లోకాశలపై విజయం నీకుందా..రాకడ..
2.ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్ధన నీకుందా(2X)
యేసు నాశించే దీన మనసుందా..రాకడ..
రుచి చూచి ఎరిగితిని
పల్లవి:రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు
రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని||రుచి చూచి||
1.గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే
తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే||రుచి చూచి||
2.మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా
మనసారా పొగడదను నీ ఆశ్చర్యకార్యములన్||రుచి చూచి||
3.మంచి తనము గల దేవా అతి శ్రేష్టుడవు అందరిలో
ముద మార పాడెద నిన్నుఅతి సుందరడవనియు||రుచి చూచి||
4.ప్రార్దింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి
సంపూర్ణముగా పొం దెదను అడుగువాటన్నిటికి||రుచి చూచి||
లెక్కలేని చుక్కలెన్నో
పల్లవి:లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ(2X)
చెప్పకుండ వెళ్ళిపోయె చక్కని చుక్క - దుఃఖమే విడిచిపోయె చక్కని చుక్క(2X)
…లెక్కలేని…
1.ప్రభువునందు మృతులే మరి ధన్యులని - విభుని చెంత చేరుటయే గమ్యమని(2X)
ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క(2X)
…లెక్కలేని…
2.దేహమందు నివశించుట వ్యర్ధమని - మోహమంత మరచుట పరమార్ధమని
ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క(2X)
…లెక్కలేని…
3.పాపలోకమందు బ్రతుకలేమని - ఆ పరమును చే్రుటయే మేలని(2X)
ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క(2X)
…లెక్కలేని…
4.యేసు ప్రభువు తిరిగి భువికి వచ్చునని - మృతులనుండి తనను తిరిగి లేపునని(2X)
ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క(2X)
…లెక్కలేని…
లెక్కింపలేనిస్తోత్రముల్
పల్లవి:లెక్కింపలేనిస్తోత్రముల్దేవాఎల్లప్పుడు నే పాడెదన్
ఇంతవరకు నా బ్రతుకులో నివు చేసినమేళ్ళకై
1.ఆకాశ మహాకాశముల్దాని క్రిందున్న ఆకాశము
భూమిలో కనబడునవన్నీదేవానిన్నే కీర్తించున్…లెక్కింపలేని…
2.అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును
భూమిపై నున్న వన్నీదేవా నిన్నే పొగుడును…లెక్కింపలేని…
3.నీటిలో నివసించు ప్రాణుల్ఈ భువిలోని జీవ రాశులు
ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్…లెక్కింపలేని…
విజయ ఘోష వినిపించెనువిశ్వమంత
పల్లవి:విజయ ఘోష వినిపించెనువిశ్వమంత- గళము లెత్తి వినిపించరస్తోత్ర గీతముల్
విజయ ఘోష వినిపించెనువిశ్వమంత- గళము లెత్తి వినిపించరస్తోత్ర గీతముల్
హల్లెలూయాహల్లెలూయా-హల్లెలూయాహల్లెలూయాహోసన్న హోసన్న హోసన్నహోసన్నహల్లెలూయా(4X)
విజయ ఘోష వినిపించెనువిశ్వమంత–గళము లెత్తి వినిపించరస్తోత్ర గీతముల్
1.అణువణువున విమోచన రాగ రవళులు -పొంగి పొరలి నరాళిలో యీనాడు
అణువణువున విమోచన రాగ రవళులు -పొంగి పొరలి నరాళిలో యీనాడు
మృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికిరక్షణకలిగెను
మృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికిరక్షణకలిగెను
హల్లెలూయాహల్లెలూయా-హల్లెలూయాహల్లెలూయా
హోసన్న హోసన్న హోసన్నహోసన్నహల్లెలూయా(4X)
విజయ ఘోష వినిపించెనువిశ్వమంత–గళము లెత్తి వినిపించరస్తోత్ర గీతముల్
2.తరతరాలపాపశాపబంధకంబులు-విడిపోయివిడుదలాయె మానవాళి
తరతరాలపాపశాపబంధకంబులు-విడిపోయివిడుదలాయె మానవాళి
అంతఃశ్చర్యము,పునురుద్ధానము-అవనిలో ఎన్నడూ జరుగనికార్యము
అంతఃశ్చర్యము,పునురుద్ధానము-అవనిలో ఎన్నడూ జరుగనికార్యము
హల్లెలూయాహల్లెలూయా-హల్లెలూయాహల్లెలూయా
హోసన్న హోసన్న హోసన్నహోసన్నహల్లెలూయా(4X)
విజయ ఘోష వినిపించెనువిశ్వమంత-గళము లెత్తి వినిపించరస్తోత్ర గీతముల్
విజయ ఘోష వినిపించెనువిశ్వమంత-గళము లెత్తి వినిపించరస్తోత్ర గీతముల్
హల్లెలూయాహల్లెలూయా-హల్లెలూయాహల్లెలూయా
హోసన్న హోసన్న హోసన్నహోసన్నహల్లెలూయా(4X)
విమోచకుడు(C#m)
విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే
సకల లోకములుసంతోషముతో గంతులు వేయు నేడే(2X)
పల్లవి:ఆనందమే ఈ దినం -ఆశ్చర్యమే అనుక్షణం
ఆత్మీయమేఆనుభవం - ఆనంద మానందమే(2X)
1.ఆకాశ తారలు కాంతి విరియగా - ప్రకృతి రవళిoచే ఈ జగాన(2X)
ముదమార గాంచిరి గొల్లలూజ్ఞానులూ||ఆనందమే||
2.నాడు పండుగ నేడు కనిపించే-లోకమాసిద్ద పడుమా(2X)
ప్రభు యేసు చెంతకు పరలోకవిందుకూ||ఆనందమే||
విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే
సకల లోకములుసంతోషముతో గంతులు వేయు నేడే(2X)
ఆనందమే ఈ దినం -ఆశ్చర్యమే అనుక్షణం
ఆత్మీయమేఆనుభవం - ఆనంద మానందమే(2X)
సదా కాలము
పల్లవి:సదా కాలము నీతో నేను జీవించెదనుయేసయ్యా
సదా కాలము నీతో నేను జీవించెదనుయేసయ్యా
యేసయ్యాయేసయ్యాయేసయ్యాయేసయ్యా
యేసయ్యాయేసయ్యాయేసయ్యాయేసయ్యా
1.పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా
పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా
ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా
ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా
యేసయ్యాయేసయ్యాయేసయ్యాయేసయ్యా
యేసయ్యాయేసయ్యాయేసయ్యాయేసయ్యా
సదా కాలము నీతో నేను జీవించెదనుయేసయ్యా
2.నీ వాత్సల్యమును నాపైజూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా
నీ వాత్సల్యమును నాపైజూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా
ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా
ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా
యేసయ్యాయేసయ్యాయేసయ్యాయేసయ్యా
యేసయ్యాయేసయ్యాయేసయ్యాయేసయ్యా
సదా కాలము నీతో నేను జీవించెదనుయేసయ్యా
సదా కాలము నీతో నేను జీవించెదనుయేసయ్యా
సమీపించరాని
పల్లవి:సమీపించరాని తెజేస్సులోనీవు వశియించువాడవయా
మా సమీపమునకు అరుదెంచినావు - నీ ప్రేమ వర్ణింప తరమా(2X)
యేసయ్యానీ ప్రేమెంత బలమైనది-యేసయ్యానీ కృప యెంత విలువైనది
యేసయ్యానీ ప్రేమెంత బలమైనది-యేసయ్యానీ కృప యెంత విలువైనది
1.ధరయందు నేనుండ చరయందు పడియుండ
పరముకు గాంచితివే - నన్నే పరమున చేర్చితివే(2X)
కలువకు కరుణను నొసగితివే..సమీపించ..
2.మితిలేని నీ ప్రేమ గతిలేని నను చూచి - నా స్థితి మార్చినది
నన్నే శ్రుతిగా చేసినది(2X)
తులువకు విలువనుయిచ్చినది..సమీపించ..
సర్వకృపానిధియగు
1.సర్వకృపానిధియగుప్రభువా-సకల చరాచరసంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదము-సంతోషముగ నినుపొగడెదము
పల్లవి:హల్లెలూయ హల్లెలూయ-హల్లెలూయ హల్లెలూయా
హల్లెలూయ యని పాడెదను - ఆనందముతో సాగెదను
2.ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో ననురక్షించితివి
పరిశుద్దముగ జీవించుటకై - పాపిని ననుకరుణించితివి..హల్లెలూయ..
3.మరణ శరీరము మార్పు నొంది - మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతోననునింపితివి - మరణ భయములనుతీర్చితివి..హల్లెలూయ..
సాగి పోదును
పల్లవి:సాగి పోదును - ఆగి పోను నేను
విశ్వాసములో నేను - ప్రార్ధనలో నేడు(2X)
హల్లెలూయ హల్లేలూయ-హల్లెలూయ హల్లేలూయ(2X)
1.ఎండిన ఎడారి లోయలలో - నేను నడిచినను
కొండ గుహలలో - బీడులలో నేను తిరిగినను(2X)
నా సహాయకుడు - నా కాపరి యేసే(2X)
…హల్లెలూయ…
2.పగలెండ దెబ్బకైనను - రాత్రి వేళ భయముకైనా
పగవాని బానములకైనా - నేను భయపడను(2X)
నాకు ఆశ్రయము - నా ప్రాణము యేసే(2X)
…హల్లెలూయ…
3.పదివేల మంది పైబడినా - పదిలముగానే నుండెదను
ప్రభు యేసు సన్నిధానమే - నాకు ఆధారం(2X)
నాకు కేడెము-నా కోటయు యేసే(2X)
…హల్లెలూయ…
సిల్వలో నాకైకార్చెను యేసురక్తము
పల్లవి:సిల్వలో నాకై కార్చెను-యేసురక్తము
శిలనైన నన్నుమార్చెను-యేసురక్తము
యేసురక్తము-ప్రభుయేసురక్తము
అమూల్యమైనరక్తము-యేసురక్తము..సిల్వలో..
1.సమకూర్చు నన్ను తండ్రితో-యేసురక్తము
సంధి చేసి చేర్చును-యేసురక్తము
యేసురక్తము-ప్రభుయేసురక్తము
ఐక్య పరచునుతండ్రితో-యేసురక్తము..సిల్వలో..
2.సమాధాన పరచును-యేసురక్తము
సమస్యలన్నితీర్చును-యేసురక్తము
యేసురక్తము-ప్రభుయేసురక్తము
సంపూర్ణ శాంతి నిచ్చును-యేసురక్తము..సిల్వలో..
3.నీతి మంతులుగా చేయును-యేసురక్తము
దుర్నీతి నంత బాపును-యేసురక్తము
యేసురక్తము-ప్రభుయేసురక్తము
నిభందన నిలుపును రక్తము-యేసురక్తము..సిల్వలో..
4.రోగములను బాపును-యేసురక్తము
దురాత్మల పారద్రోలును-యేసురక్తము
యేసురక్తము-ప్రభుయేసురక్తము
శక్తి బలమునిచ్చును-యేసురక్తము..సిల్వలో..
సిలువయందె నీదు ప్రేమ
పల్లవి:సిలువయందె నీదు ప్రేమ తెలిసికొంటినో ప్రభు(2X)
1.నాదు పాప గాయములను-మాపగోరి సిల్వపై
నీదు దేహ మంత కొరడా దెబ్బలోర్చికొంటివి
..సిలువయందె..
2.తండ్రి కుమారశుద్దాత్మలదేవ-ఆరాధింతు ఆత్మతో
హల్లెలూయ స్తోత్రములను ఎల్లవేళ పాడెదం
..సిలువయందె..
సృష్టికర్త యేసుని స్తుతించెదము(Db)
పల్లవి:సృష్టికర్తయేసునిస్తుతించెదము సర్వసృష్టియు ప్రభు క్రియలే
సర్వ జనాలి సునాదముతో ప్రభుని క్రియలు ఘనపరచెదము
హ...హ.. హ... హ..హల్లెలూయా...|| 3 times ||హల్లెలూ... యాపాడెదము
1.అగాధజలములపై ఆత్మ అలల ఊయల ఊగిన వేల
చీకటిని విడదీసి శూన్యమును వెలిగించి
నీదు మహిమను చూపితివే||సృష్టి||
2.అంతరిక్షమున జ్యోతులను అభినవ లోకము విరసిన వేళ
ప్రాణులను సృజియించి ప్రకృతిని యింపుగను
రూపించిన నిను పొగడెదను||సృష్టి||
3.భూఆవిరిని రప్పించి ఆరిన నేలను తడిపిన వేళ
మంటి నుండి మము చేసి నాసికలో జీవమూది
మనిషికి రూపము నిచ్చితివే||సృష్టి||
సృష్టికర్త యేసుని స్తుతించెదము(Db)
పల్లవి:సృష్టికర్తయేసునిస్తుతించెదము
సర్వసృష్టియు ప్రభు క్రియలే
సర్వ జనాలి సునాదముతో
ప్రభుని క్రియలు ఘనపరచెదము
హ...హ.. హ... హ..హల్లెలూయా...(3X)
హల్లెలూ... యాపాడెదము
1.అగాధజలములపై ఆత్మ
అలల ఊయల ఊగిన వేల
చీకటిని విడదీసి
శూన్యమును వెలిగించి
నీదు మహిమను చూపితివే||సృష్టి||
2.అంతరిక్షమున జ్యోతులను
అభినవ లోకము విరసిన వేళ
ప్రాణులను సృజియించి
ప్రకృతిని యింపుగను
రూపించిన నిను పొగడెదను||సృష్టి||
3.భూఆవిరిని రప్పించి
ఆరిన నేలను తడిపిన వేళ
మంటి నుండి మము చేసి
నాసికలో జీవమూది
మనిషికి రూపము నిచ్చితివే||సృష్టి||
సృష్టి పితా
పల్లవి:సృష్టి పితా - సర్వో న్నతా = సమర్పింతున్ - సర్వస్వమున్
1.భూమి ఆకాశము నీవే - భూధర శిఖరములు నీవే = భూ ప్రజలు నీవారే -
బల శౌర్యములు నీవే
2.మా వెండి బంగారములు నీవే - మాకున్న వరములు నీవే = మా దేహముల్ -
మా గేహముల్ మా జీవితము నీవే
3.వెల లేని గాలి వెలుతురులు - విలువైన పాడి పైరులు = వివిధంబులైన
దీవెనలు - నీ కరుణా వర్షములు
4.పరిశుద్ద గ్రంథపు పలుకులు - పరలోక తేనె చినుకులు = ప్రభు యేసుని
మాటలు - మా వెల్గు బాటలు
స్తోత్రం చెల్లింతుము
పల్లవి:స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రంచెల్లింతుము(2X)
యేసు నాథుని మేలులు తలంచి(స్తోత్రం)
1.దివారాత్రములు-కంటిపాపవలె కాచి(2X)
దయగల హస్త్తముతో-బ్రోచి నడిపించితివి(స్తోత్రం)
2.గాడాందకారములో-కన్నీటి లోయలలో(2X)
క్రుసించి పోనీయక-క్రుపలతోబలపరచితివి(స్తోత్రం)
3.సజీవ యాగముగా-మా శరీరముసమర్పించి(2X)
సంపూర్ణ సిద్దినొంద-శుద్దాత్మను నొసగి తివి(స్తోత్రం)
శ్రీ యేసు గీతి పాడవా
పల్లవి:శ్రీ యేసు గీతి పాడవా - ఆ సిల్వ ప్రేమ చాటవా(2X)
జనులెందరో - నశించు చుండగా(2X)
సువార్త చాట కుందువా - నాకేమిలే అందువా(2X)
1.ప్రభు ప్రేమను - రుచి చూచియు -మరి ఎవ్వరికి పంచవా
పరలోకపు - మార్గంబును -పరులేవ్వరికి చూపవా(2X)..సువార్త..
2.ప్రతి వారికి- ప్రభు వార్తను - ప్రకటింప సంసిద్దమా
పరిశుద్దుడే - నిను పంపగా - నీకింక నిర్లక్ష్యమా2X)..సువార్త..
హల్లెలూయ స్తుతి మహిమ
పల్లవి:హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడుదేవుని కిచ్చెదము
ఆ..... హల్లెలూయ ... హల్లెలూయ ... హల్లెలూయ ...
1.అల సైన్యములకు అధిపతియైన-ఆ దేవుని స్తుతియించెదము
అల సాంద్రములను దాటించిన-ఆ యెహోవాను స్తుతియించెదము
...హల్లెలూయ...
2.ఆకాశము నుండి మన్నాను పంపిన-ఆ దేవుని స్తుతియించెదము
బండ నుండి మధుర జలమునుపంపిన ఆ యెహోవాను స్తుతియించెదము
...హల్లెలూయ...
హల్లెలూయ స్తోత్రం
నాననానానాననానా నా
నాననానానాననానా నా
హల్లెలూయ స్తోత్రం,నజరేయ నిజమగు స్తోత్రం
ప్రభు తనయ స్తోత్రం నీ దరి చేరనిమ్ము(2X)
స్తోత్రం జనకుడ,స్తోత్రం తనయుడ స్తోత్రం శుద్దాత్మా(4X)
నాననానానాననానా నా
నాననానానాననానా నా
1.స్తుతి చేయుట మీకది తెలుయునా మదిని నిండిన స్తోత్రమే
స్తుతి కర్ణుడు ఎవరో తెలుయునా ప్రభువగు యేసు క్రీస్తుడే(2X)
…స్తోత్రం…
…హల్లెలూయ స్తోత్రం…
నాననానానాననానా నా
నాననానానాననానా నా
2.స్తుతి చేయుట ఎపుడో తెలియునా దివారాత్రము యోగ్యమే
స్తుతి చేయుట ఫలితము తెలియునా ప్రభు కృప మనపై పదిలమే(2X)
…స్తోత్రం…
…హల్లెలూయ స్తోత్రం…
హల్లెలూయ యేసు ప్రభున్
1.హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి
పల్లవి:రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్
హల్లెలూయా,హల్లెలూయా దేవుని స్తుతియించుడి
2.తంబురతోను వీణతోను ప్రభువునిస్తుతియించుడి
పాపమును రక్తముతో తుడిచెనుస్తుతియించుడి
బూరతోను తాళముతో మ్రోగించిస్తుతియించుడి
నిరంతరము మారని యేసునిస్తుతియించుడి…రాజుల…
3.సూర్య చంద్రులారఇల దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి
అగ్నివడ గండ్లారమీరుకర్తను స్తుతియించుడి
హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి…రాజుల…
4.యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి
జీవితమున్ ప్రభుపనికైసమర్పించి స్తుతియించుడి
పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి
ఆస్తులనుయేసునకై అర్పించి స్తుతియించుడి…రాజుల…
5.అగాథమైనజలములారా దేవుని స్తుతియించుడి
అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి
దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి
పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి…రాజుల…
హల్లేలూయ పాడెద
పల్లవి:హల్లేలూయ పాడెద-ప్రభు నిన్ను కొనియాడెదన్
అన్నీ వేళల యందున-నిన్ను పూజించి కీర్తింతును
ప్రభువా,నిన్ను నేకొనియాడెదన్…హల్లేలూయ…
1.వాగ్దానములనిచ్చి-నెరవేర్చువాడవు నీవే
నమ్మాకమైన దేవా-నన్ను కాపాడు వాడవు నీవే(2X)
ప్రభువా,నిన్ను నేకొనియాడెదన్…హల్లేలూయ…
2.ఎందారు నిను చూచిరో-వారికి వెలుగు కలిగెన్
ప్రభువా నీ వెలుగొందితి-నా జీవంపు జ్యోతివి నీవే(2X)
ప్రభువా,నిన్ను నేకొనియాడెదన్…హల్లేలూయ…
3.కష్టాములన్నిటిని-ప్రియమూగ భరియింతును
నీ కొరకే జీవింతును-నా జీవంపు దాతవు నీవే(2X)
ప్రభువా,నిన్ను నేకొనియాడెదన్…హల్లేలూయ…
హల్లేలూయ పాడెద(Fm)
పల్లవి:హల్లేలూయ పాడెద ప్రభు నిన్ను కొనియాడెద(2X)
అన్నీ వేళలయందున నిను పూజించి కీర్తింతును(2X)
ప్రభువా,నిన్ను నే కొనియాడెదన్
...హల్లేలూయ పాడెద ...
1.వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే(2X)
నమ్మాకమైనా దేవా నను కాపాడు వాడవు నీవే(2X)
ప్రభువా,నిన్ను నే కొనియాడెదన్
...హల్లేలూయ పాడెద ...
2.ఎందారు నిను చూచిరో వారికి వెలుగు కలిగెన్(2X)
ప్రభువా నీ వేలుగొందితి నా జీవంపు జ్యోతివి నీవే(2X)
ప్రభువా,నిన్ను నే కొనియాడెదన్
...హల్లేలూయ పాడెద ...
3.కష్టాములన్నిటిని ప్రియముగా భరియింతును(2X)
నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే(2X)
ప్రభువా,నిన్ను నే కొనియాడెదన్
...హల్లేలూయ పాడెద ..
lyrics of uecf.net
WORLD OF GOD0001
PRAYER REQUESTS` My mobile number: +918553689570 Phonepay. Googlpay. Paytam. Send your offering money 💸💰 god bless you all massages send me we are will pray www.bibletv.wap.sh www.godtv.wap.sh www.jesustv.wap.sh www.powermtv.wap.sh www.jesusbible.wap.sh www.jesusgod.wap.sh godtv||Bibletv
JESUS TRUTH0001
BACK||HOME
Chandru
@2013-2014 ALL RESEVID Copy Rights...||
CHANDRUJ.WAP.SH
110